భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
బాలాత్రిపురసుందరీదేవి అలంకరణలో త్రిముఖదుర్గాదేవి
సిఎస్ పురం,మేజర్ న్యూస్:
ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పర్యాటక శైవక్షేత్రమైన భైరవకోనలో విజయదశమి పండుగ సందర్భంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభించారు.ఈసందర్భంగా త్రిముఖదుర్గ అమ్మవారు స్వామివార్లకు పంచామృత అభిషేకం కుంకుమార్చన పూజలు నిర్వహించారు.అనంతరం త్రిముఖదుర్గ అమ్మవారిని బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరణ చేసి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు, కార్యనిర్వాహణాధికారి డి.వంశీకృష్ణారెడ్డి అధ్వర్యంలో అర్చకులు కె.వెంకట నరసయ్య,పి.రామ్మూర్తి,సుధాకరశర్మ అర్చకుల బృందం వేదపండితులు మహాగణపతి వివిధ హోమపూజలు నిర్వహించారు.ఈపూజా కార్యక్రమంలో ఇఓ వంశీకృష్ణారెడ్డి, ఉభయదాతలు ప్రత్యేక పూజలుచేసి అనంతరం నైవేద్యం సమర్పించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.ఈసందర్భంగా ఇఓ మాట్లాడుతూ దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు అధ్వర్యంలో భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు అదేవిధంగా అమ్మవారిని రోజుకొక అలంకరణ చేసి హోమాలు,పూజలు నిర్వహిస్తామని భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నివసతులు కల్పించినట్లు ఇఓ తెలిపారు. ఈకార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, ఉభయదాతలు,భక్తులు పాల్గొన్నారు.