BREAKING
స్నేహబంధానికి నిదర్శనం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల చేయూత.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టిన మండల టిడిపి నాయకులు దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: కీసర ఇన్‌స్పెక్టర్‌ బిక్కి రమేష్‌ రామన్నపేటలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం వికారాబాద్‌ జిల్లా దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి: పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి.. వాహన పార్కింగ్ కు సూచనలు ఎస్పీ మీనాను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ ను కలిసిన మాజీ జడ్పిటిసి పట్లోళ్ల రాములు భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం

ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్

Select Suryaa Now
ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం  అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్

కామవరపుకోట , సూర్య న్యూస్:ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మండపంలో ఆదివారం అసోసియేషన్ (రిజి. నెం. 963/2019) ఎన్నికలు నిర్వహించారు. గత నెల 14న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్

ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి. శ్యామ్ ప్రసాద్ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్, ఉపాధ్యక్షులు-1గా గుత్తికొండ వంశీ కిరణ్, ఉపాధ్యక్షులు-2గా టంగుటూరు రాధికా రెడ్డి, ఉపాధ్యక్షులు-3గా జె.వి. అనిల్ కుమార్, కోశాధికారిగా ఏలేశ్వరపు నీలాద్రి వెంకట కుమార్ ఎన్నికయ్యారు.

కార్యనిర్వాహక సభ్యులుగా కె. క్రాంతి కుమార్, జి.ఎస్.ఎస్. పవన్ కుమార్, ఎం. అచ్యుతాంబ, జి. సరిత, ఎం.వి.ఎస్. సాయి కుమార్, బాపనపల్లి ఉమా శంకర్, ఎ. రెడ్డప్ప, ఎం. అంజలీ దేవి, బి. చక్రవర్తి, డి. మౌనిక ఎన్నికయ్యారు.

పరిశీలకుల సమక్షంలో ఎన్నికలు

ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) తరఫున స్వేన్ హరేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ తరఫున బడేటి వెంకట్రామయ్య పరిశీలకులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.

జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్

ఎన్నికల అనంతరం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఎం. డేనియల్ ప్రదీప్‌ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడ అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించడం వంటి అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో ఫుట్‌బాల్ అభివృద్ధే లక్ష్యం: కోటగిరి శ్రీధర్

మీడియా సమావేశంలో నూతన అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేయడమే నూతన కార్యవర్గం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

క్షేత్రస్థాయి నుంచి ఫుట్‌బాల్ క్రీడను బలోపేతం చేస్తూ, మరింత మంది యువతను ఈ క్రీడ వైపు ఆకర్షించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాకారులు ఉన్నత స్థాయిలో రాణించేలా అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం, అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కోటగిరి శ్రీధర్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వంటిపల్లి వెంకటేశ్వరరావు,క్రాంతి కిరణ్,బడేటి  రామయ్య, చక్రవర్తి,అనిల్,వంశీ,గణేష్, రానా ,రాధిక రెడ్డి,శేషు, కొత్తపల్లి అనిల్,రాజశేఖర్, తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 పసుమర్తి రాము జిల్లా ఇన్చార్జి ఏలూరు,