సీఎం దసరా శుభాకాంక్ష్లలు
ముఖ్యమంత్రి చంద్రబాబు దసరా శుభాకాంక్ష్లలు
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
దుష్టశక్తులపై దైవశక్తి, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. నేటి నుంచి ప్రారంభమవుతున్న శరన్నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆరాధించడం మన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి. అమ్మవారి కరుణాకటాక్షాలతో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా వర్ధిల్లాలి. ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.రాష్ట్ర ప్రజలందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు