BREAKING
కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్.. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం వీఆర్ఏలకు మద్దతు తెలిపిన ఒంటెద్దు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఐ సపోర్ట్ ఏ గ్రీనర్ ఇండియా’ సెల్ఫీ ఫ్రేమ్ ప్రారంభం..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి.. ధారూర్ మండలంలో పింఛన్లపై క్షేత్రస్థాయి పరిశీలన.. జెడ్పీ సీఈఓ సుధీర్ పర్యటన పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులే కీలకం శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గంగానమ్మ అమ్మవారు రెవెన్యూ సేవలను జవాబుదారితనంతో పారదర్శకంగా పరిష్కార మార్గాలు చూపాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందిన వ్యక్త కుటుంబానికి రూ. 6 లక్షల సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

స్ధానిక ఎన్నికలపై సీఎం

Select Suryaa Now
స్ధానిక ఎన్నికలపై సీఎం

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తును ముమ్మరం చేశారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పరిశీలకులు, పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార కార్యక్రమాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై వర్చువల్‌ సమావేశంలో కీలక సూచనలు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు పార్టీ తరఫున 40 శాతం వరకు సీట్లు కేటాయించేలా కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. నాయకుల పనితీరుకు రేటింగ్‌లు ఇస్తామని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేయని వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.స్థానిక ఎన్నికలను సాధారణంగా తీసుకోవద్దని, కూటమి బలం మరింత పెరగడానికి ఇవి కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్ల శాతం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 50 రోజులు ప్రతి నాయకుడూ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలతోపాటు నిజాయితీ, సమర్థత, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి మించి స్థానాలు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించామని, పార్టీ పరంగా 40 శాతం వరకు సీట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. బీసీ నాయకత్వాన్ని పెంపొందించడానికి స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా మలచుకోవాలని సూచించారు. ‘జయహో బీసీ.. జనాభాలో సగం – కూటమి ఇచ్చింది బలం’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న మద్దతును మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో సమష్టి కృషితో ముందుకు సాగాలని, అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని అంశాల్లో సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.