BREAKING
ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన,

మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

Select Suryaa Now
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత  అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్పట్టణంలోని రాజుల కాలనీ 6వ సచివాలయం వద్ద సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సోమవారం ఆయుష్మాన్ భారత్ వైద్య శిబిరం, లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి పునాది అని పేర్కొన్నారు.పట్టణ బీజేపీ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలుపై లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోవాలని, ప్రజలకు సేవలందిస్తున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ సిబ్బంది షేక్ సబీనా బేగం, నీలి పుష్పలను శాలువాలతో సత్కరించారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ లక్ష్మీరాజ్యం, ఏఎన్‌ఎం సూపర్‌వైజర్లు సలోని, మున్నా, వార్డు మాజీ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరావు, తెలుగు మహిళ నాయకురాలు పగడం సౌభాగ్యవతి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు వేమూరి శ్రీనివాసరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా