BREAKING
దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు

బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే

Select Suryaa Now
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుంచి కంటెస్టెంట్ టెంపర్ వంశీ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. తెలుగు సినిమాల్లో విలన్, విలన్ గ్యాంగ్ పాత్రలతో గుర్తింపు పొందిన వంశీ ఈ సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టి సుమారు 12 వారాల పాటు కొనసాగారు. పెద్దగా అంచనాలు లేకుండానే హౌస్‌లోకి వచ్చినప్పటికీ, తనదైన శైలిలో ఆటను కొనసాగిస్తూ గతంలో కొన్ని కీలక దశల నుంచి బయటపడి నిలిచారు.

తాజా వీకెండ్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా టెంపర్ వంశీ హౌస్‌ను వీడినట్లు తెలుస్తోంది. స్టేజీపైకి వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్వేగానికి లేదా కన్నీళ్లకు లోనుకాకుండా ప్రశాంతంగా కనిపించినట్లు సమాచారం. తన బిగ్ బాస్ జర్నీ వీడియోను తిలకించిన అనంతరం, త్రిగుణ్‌తో కప్పు గెలవాలంటూ ఆకాంక్షించి ఆయన వీడ్కోలు తీసుకున్నట్లు వినికిడి.

పారితోషికం విషయానికి వస్తే, వారానికి సుమారు రూ. 2 లక్షల చొప్పున 12 వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు గాను టెంపర్ వంశీకి మొత్తం రూ. 24 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. సీజన్ 10లో త్రిగుణ్, ముఖేష్, రాంప్రసాద్, దేబ్జానీ, రామకృష్ణ, వర్షిణి వంటి కంటెస్టెంట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతున్న వేళ వంశీ నిష్క్రమణ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.