BREAKING
పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్ యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత

పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే

Select Suryaa Now
పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే

సూర్య బిజినెస్ డెస్క్: గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ సామాన్య కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసిన బంగారం ధరలు ఆదివారం నాడు కాస్త శాంతించాయి. నవంబర్ 29వ తేదీన దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ఆభరణాల దుకాణాల్లో కొనుగోళ్ల సందడి నెలకొన్న వేళ ధరలు నిలకడగా ఉండటం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది.

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,27,860 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,17,200 వద్ద ట్రేడవుతోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ ఇవే ధరలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,010 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,17,350 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధరలు కూడా ఆదివారం నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ బులియన్ మార్కెట్లలో కిలో వెండి ధర రూ. 1.70 లక్షల వద్ద కొనసాగుతోంది. గత వారం రోజుల గణాంకాలను పరిశీలిస్తే, నవంబర్ 23వ తేదీన హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,25,070గా ఉండగా, వారం వ్యవధిలో రూ. 2,790 పెరిగి రూ. 1,27,860కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,14,640 నుంచి రూ. 2,560 పెరిగి రూ. 1,17,200 వద్ద నిలిచింది. అయితే వెండి విషయంలో మాత్రం వారం క్రితం రూ. 1.75 లక్షలుగా ఉన్న కిలో ధర రూ. 5,000 తగ్గి ప్రస్తుతం రూ. 1.70 లక్షల వద్ద కొనసాగుతోంది.