BREAKING
బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు

రామాయపట్నంలో రూ.1.27 లక్షల కోట్ల భారీ చమురు శుద్ధి, పెట్రో రసాయన పరిశ్రమకు బీపీసీఎల్‌ ఆమోదం..

Select Suryaa Now
రామాయపట్నంలో రూ.1.27 లక్షల కోట్ల భారీ చమురు శుద్ధి, పెట్రో రసాయన పరిశ్రమకు బీపీసీఎల్‌ ఆమోదం..

సూర్య బిజినెస్ & ఇండస్ట్రీ డెస్క్ (అమరావతి/ముంబై): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో మరో కీలక అధ్యాయం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద సుమారు రూ.1.27 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ చమురు శుద్ధి (రిఫైనరీ) మరియు పెట్రో రసాయన (పెట్రోకెమికల్) కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్  అధికారిక ఆమోదం తెలిపింది.

బంగాళాఖాత తీరంలోని రామాయపట్నం ఓడరేవుకు సమీపంలో ఏర్పాటు కానున్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దేశీయ ఇంధన శుద్ధి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. రవాణా సౌకర్యాలు, తీరప్రాంత అనుకూలతలు మరియు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఈ భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఈ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభించనుందని, అనుబంధ పరిశ్రమల వృద్ధితో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక, పారిశ్రామిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.