BREAKING
ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన,

రెవెన్యూ సేవలను జవాబుదారితనంతో పారదర్శకంగా పరిష్కార మార్గాలు చూపాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి.

Select Suryaa Now
రెవెన్యూ సేవలను జవాబుదారితనంతో పారదర్శకంగా పరిష్కార మార్గాలు చూపాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి.

.అమలాపురం మేజర్ న్యూస్ రెవెన్యూ సేవలను ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా జవాబుదారితనంతో పారదర్శకంగా పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్ లో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి., డీఆర్వో వి.సుబ్బారావు, ఎస్డీసీడి.అచ్చుతాకుమారి, డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు, డ్వామా పీడీ జీఎస్.రామ్ గోపాల్, సమగ్ర శిక్ష ఏపీడీ మమ్మి, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి వి.విజయలక్ష్మి తదితరులతో కలిసి జిల్లా నులుములల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరించారు. 

భూ రికార్డు ఆన్ లైన్ లో నమోదు, రీ సర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పారిశుధ్యం, మురికి కాలువలకు పుడికతీత, ఇంటిస్థలం, గృహం, పింఛను, సదరం సర్టిఫికెట్, రోడ్లు మంజురు వంటి అంశాలపై మొత్తం -  179 అర్జీలు అందాయి.  ఈ అర్జీలను సంబంధిత అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవిమాట్లాడుతూ..  ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపీజీఆర్ఎస్  కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

 ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వివిధ శాఖల్లో నమోదైన ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించి,  సత్వర పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ అర్జీలన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యతతో కూడిన పరిష్కర నివేదికలు అర్జీదారులకు  అందివ్వాలన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలను సక్రమంగా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు.
ప్రజలు తమ ఫిర్యాదుల కోసం 1100 టోల్ ఫ్రీ నెంబర్, మీకోసం ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని, అలాగే అర్జీల పరిష్కార పురోగతిని నేరుగా తెలుసుకోవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజల తమ సమస్యలపై తమ పరిధిలోని డివిజన్, మండల, స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయ స్థాయిలలో కూడా సమర్పించవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవికోరారు.కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.