BREAKING
ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన,

ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి

Select Suryaa Now
ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 ఉన్నంతవరకు మంచి పనులు చేయాలని ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలని  రాష్ట్ర మానవత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎన్. రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన సోమవారం ఆత్రేయపురంలో 148 వ మానవత శాఖను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు

 ఈ సందర్భంగా ఆత్రేయపురం అల్లూరి సీతారామరాజు సెంటర్ లో  జరిగిన ప్రారంభ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు మనుషులు భగవంతుడు ఇచ్చిన వివేకాన్ని కోల్పోకుండా అహంకారం లేకుండా వినయంతో జీవించాలన్నారు. ప్రతినిత్యం శ్రద్ధతో సాధన చేసి తమ వృత్తులకు న్యాయం చేయాలన్నారు తల్లిదండ్రులను దైవ సమానులుగా ఆరాధించాలని వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టుకోవాలని  ప్రతి వ్యక్తి ప్రేమతో జీవించాలని, నిస్సహాయులకు చేయూతనందించాలన్నారు ఈ సందర్భంగా  ఆత్రేయపురం శాఖ నూతన అధ్యక్షుడుగా నియమితులైన దండు వెంకట సుబ్బరాజు, కార్యదర్శి వేగేశ్న శ్రీనివాసరాజు, ముదునూరి సోమరాజు, పులవర్తి నాగేశ్వరరావు, పేరూరి నాగేశ్వరరావు, గల్లి వెంకటేశ్వరరావు  ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు  ఈ సందర్భంగా ఎన్. రామచంద్ర రెడ్డి, స్థానిక మానవతా అధ్యక్షుడు దండు సుబ్బరాజు, కార్యవర్గాన్ని ముదునూరి బండ కృష్ణరాజు  గొట్టుముక్కల గోపి రాజు లు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాలలో మానవతా సంస్థ స్థానిక కోఆర్డినేటర్ గాదిరాజు ప్రసాదరాజు, సెంట్రల్ కమిటీ నేతలు కోడూరి రాధా పుష్పావతి, రామలక్ష్మి, చిట్టూరి సుజాత, సిపి రెడ్డి, వెంకట సూర్యనారాయణ, రామానుజుల రెడ్డి, చంద్రయ్య, కోటేశ్వరరావు, గమిని రాంబాబు, రామిశెట్టి గంగాధరరావు, కాశీ విశ్వనాధ రాజు, శారదా దేవి, రుద్రమదేవి, ధర్మారెడ్డి,తదితరులు మానవతాసంస్థ ఆవశ్యకతపై ప్రసంగించారు కాగా మానవత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్. రామచంద్రారెడ్డి చేతుల మీదుగా శాంతిరథం, ఫ్రీజర్ బాక్స్  ల ను ఆత్రేయపురం శాఖకు అందజేశారు ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు మాజీ ఎంపీపీ పిఎస్ రాజు  పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.