ధారూర్ మండలంలో పింఛన్లపై క్షేత్రస్థాయి పరిశీలన.. జెడ్పీ సీఈఓ సుధీర్ పర్యటన
ధారూర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11):ధారూర్ మండలంలోని గ్రామపంచాయతీల్లో పింఛన్ల పంపిణీ, లబ్ధిదారుల అర్హతలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జెడ్పీ సీఈఓ సుధీర్, మండల ఇన్‌ఛార్జ్ ఎంపీడీఓ అజయ్ కుమార్‌తో కలిసి హరిదాస్‌పల్లి, చింతకుంట, ధారూర్ స్టేషన్ గ్రామపంచాయతీల్లో పర్యటించి పింఛన్ల వివరాలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల అర్హత పత్రాలను పరిశీలించి, అర్హులైన వారికి పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. పింఛన్ల పంపిణీలో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలనను సమగ్రంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్: సుధాకర్, ధారూర్, వికారాబాద్ జిల్లా.