BREAKING
ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన,

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందిన వ్యక్త కుటుంబానికి రూ. 6 లక్షల సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందిన వ్యక్త  కుటుంబానికి రూ. 6 లక్షల సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి  :ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.

నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్.. అక్కడ జరుగుతున్న క్షిపణులు, డ్రోన్ దాడుల్లో మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మృతుడి భార్య విజ్ఞప్తి మేరకు ఈ దుర్ఘటనను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించి బాధితులకు రూ. 6 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఈ సాయం అందించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు, సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.