BREAKING
ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన,

శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గంగానమ్మ అమ్మవారు

Select Suryaa Now
శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గంగానమ్మ అమ్మవారు

 

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ పట్టణ గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. లలితా పారాయణం, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ప్రధాన పూజల్లో దండమూడి డాక్టర్ ప్రసాద్ దంపతులు, పసుమర్తి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఉదయం ప్రసాద దాతలుగా శ్రీమన్నారాయణ ఎంటర్‌ప్రైజెస్, శ్రీ బాలాజీ ఎంటర్‌ప్రైజెస్, కేశినేని నాగబాబు దంపతులు వ్యవహరించగా, సాయంత్రం కొల్లి రాంబాబు దంపతులు ప్రసాద వితరణ చేపట్టారు. అమ్మవారి అలంకరణకు సింగులూరి సతీష్ చీరను సమర్పించారు.

 రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా