BREAKING
ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన,

17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం

Select Suryaa Now
17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం

 నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు సోమవారం 

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17.55 లక్షలు చేసే 35 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉదయం సుమారు 8:30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్  ఆదేశాల మేరకు , సెంట్రల్ జోన్ ఏ ఎస్పీ తరుణ్ పాశ్వా  గారి పర్యవేక్షణలో 3 టౌన్ ఎస్ ఐ వి. అప్పారావు  రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో, గండి పోచమ్మతల్లి ఆలయం ఎదురుగా తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో రాజానగరం నుంచి కొవ్వూరు వెళ్లే మార్గంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, త్రి టౌన్ లా అండ్ ఆర్డర్ ఎస్ ఐ అప్పారావు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహింchi గంజాయిని అక్రమంగా కలిగి ఉండి, రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా, 

కొండపి మండలం, కట్టవారిపాలెం గ్రామానికి రావూరి రాజేంద్రను, రాజమహేంద్రవరం, గణేష్ నగర్, కోరుకొండ రోడ్డులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎదురుగా నివాసం ఉండి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేపీహెచ్ బి ఫేజ్-2 పబ్లిక్ పార్క్ సమీపంలోని బాలుర హాస్టల్‌లో ఉంటున్న పాచేర్ల క్రాంతికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు బ్యాగుల్లోని 35.100 కేజీల గంజాయిని, దాని విలువ సుమారు రూ.17,55,000/- స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ప్రధాన ముద్దాయి వద్ద నుంచి వివో సెల్‌ఫోన్  మరియు రూ.500 నగదును, రెండవ నిందితుడు వద్ద నుంచి శాంసంగ్ సెల్‌ఫోన్  రియల్ మి సెల్‌ఫోన్ మరియు రూ.300/- నగదును స్వాధీనం చేసుకున్నారు. మాస్ట్రో ఎడ్జ్ ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీన ప్రక్రియను మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో, నిందితులు ఒడిశా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గుర్తుతెలియని వ్యక్తి వద్ద కిలో గంజాయిని కొనుగోలు చేసి, అధిక ధరకు విక్రయించడంతో పాటు తమ వ్యక్తిగత వినియోగం కోసం తీసుకువస్తున్నట్లు వెల్లడైంది. ఈ గంజాయి సేకరణకు ఏ 3  ప్రకాశం జిల్లా, కొండపి మండలం, కుమ్మరిపాలెం గ్రామానికి మాదాల వెంకటేశ్వరరావు చెందిన వ్యక్తి పంపినట్లు నిందితులు తెలిపారు. ప్రస్తుతం వెంకటేశ్వరరావు పరారీలో ఉండగా కేసు నమోదు చేసి ఇద్దరి ముద్దాయిలను గౌరవ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్ ఐ అప్పారావు తెలిపారు. గంజాయి స్వాదినం కేసులో ప్రతిభ కనబర్చిన వి. అప్పారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ , వి అప్పలరాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు సిబ్బంది వి కృష్ణ హెడ్ కానిస్టేబుల్, యస్ చంద్ర శేఖర్ , హెడ్ కానిస్టేబుల్, కె పవన్ కుమార్ , కానిస్టేబుల్, జె అర్జున రాజు , కానిస్టేబుల్ లను  తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ  అబినందించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారం తెలిసినవారు పోలీసులకు తెలియజేసి గంజాయి రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.