BREAKING
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: కీసర ఇన్‌స్పెక్టర్‌ బిక్కి రమేష్‌ రామన్నపేటలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం వికారాబాద్‌ జిల్లా దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి: పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి.. వాహన పార్కింగ్ కు సూచనలు ఎస్పీ మీనాను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ ను కలిసిన మాజీ జడ్పిటిసి పట్లోళ్ల రాములు భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం

ఎల్ నినోను కాంగ్రెస్ కు అంటగట్టడం హాస్యాస్పదం

Select Suryaa Now
ఎల్ నినోను కాంగ్రెస్ కు అంటగట్టడం హాస్యాస్పదం

 

*బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం - పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్*

కడ్తాల్: ఎల్ నినో ప్రభావం అనేది సహజ వాతావరణ ప్రక్రియ అని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టడం బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పీసీసీ కార్యవర్గ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి పథకాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన రైతులకు ఎంత న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉండి పట్టించుకోకుండా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక రైతులపై ప్రేమ ఒలకబోయడం అవకాశవాదమని మండిపడ్డారు.

ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెగురి వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మండల అధ్యక్షుడు పోతుగంటి శంకర్, బిచ్యా నాయక్, జగన్ గౌడ్, రాజు గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మేజర్ న్యూస్ కడ్తాల్…