పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు
రేపల్లె, మేజర్ న్యూస్; రేపల్లె పట్టణంలో అంకమ్మ చెట్టు కోట వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను, పెద్ద కూరగాయల మార్కెట్ వద్ద నిర్మించిన ప్రధాన రహదారి, మున్సిపల్ కాంప్లెక్స్ ఫ్రూట్ మార్కెట్ , రోడ్డు విస్తరణతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో పూర్తి చేసిన అంతర్గత సీసీ రోడ్లను రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహచర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగానీి మాట్లాడుతూ గతంలో అస్తవ్యస్తంగా మారిన రహదారులు, మురుగునీటి సమస్యలతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నాణ్యతా ప్రమాణాలతో ఈ మౌలిక వసతుల పనులను వేగవంతంగా పూర్తి చేశాం అని తెలిపారు. పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందనీ పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్న వాటి ముందుగానే గుర్తించి సమస్యను పరిష్కరించడంలో ముందుంటున్నామని అందులో భాగంగానే కోట్ల రూపాయలు హెచ్చించి పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అదేవిధంగా నాణ్యత ప్రమాణాలను పాటించడంలో ఎక్కడ తగ్గేది లేదని నా కుటుంబ సభ్యులైన నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటూ అభివృద్ధి పరచడమే తన ప్రథమ కర్తవ్యం అని మంత్రి అనగాని స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.