శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
(అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి)
అనంతపురం బెంగళూరు రోడ్డులోని శ్రీ శ్రీ శ్రీ శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం 6.30 గంటలకు గంగాపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, పంచగవ్య పూజ, నాంది, సప్తమాతృకల పూజ నిర్వహించారు.అ నంతరం అనంతేశ్వరి దేవి, అనంతేశ్వర స్వామివార్లకు ఏకవార రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించి మహా మంగళహారతి సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంతేశ్వరి దేవి గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జుటూరు అరవింద్, రత్నగిరి దేవరాజు, మల్లికార్జున, సురేష్, నాగభూషణం, లక్ష్మీనారాయణ, భాను, చెన్నకేశవులు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.