BREAKING
ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అవాంఛనీయ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ నాగమల్లేశ్వరరావు. అధిష్టానం ఆదేశిస్తే .. మా కుటుంబంలోనే మున్సిపల్ చైర్మన్ మీ రాక మాకు పండుగ జనసేన విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి గడ్డమణుగు రవికుమార్ షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ గా వెంకటేశ్వర్లు... కేశంపేట సిఐ గా శ్రీనివాస్.. దుర్గమ్మ కరుణా, కటాక్షం ప్రజలందరిపై ఉండాలి ప్రజలకు మెరుగైన అంతరాయం లేకుండా విద్యుత్ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేయాలి ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం జర్నలిస్ట్ ఆర్కే ను పరామర్శించిన రాజా, వేణు సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్

ఎంపీ నిధుల నుంచి రూ.70 లక్షలు నియోజకవర్గం అభివృద్ధి కి మంజూరుచేసిన ఎంపీ శ్రీభరత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కోళ్ల

Select Suryaa Now
ఎంపీ నిధుల నుంచి రూ.70 లక్షలు  నియోజకవర్గం అభివృద్ధి కి మంజూరుచేసిన  ఎంపీ శ్రీభరత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కోళ్ల

లక్కవరపుకోట, మేజర్ న్యూస్: ఎస్.కోట నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.70 లక్షలు మంజూరయ్యాయి. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ ఈ నిధులను కేటాయించడంపై ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హర్షం వ్యక్తం చేశారు. ఎల్.కోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిధుల కేటాయింపు వివరాలను ఆమె వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎస్.కోట ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో 10 పడకల క్యాజువాలిటీ వార్డు నిర్మాణం, నూతన లేబర్ రూమ్ కాంప్లెక్స్ ఏర్పాటు, రోగుల సహాయకుల కోసం పైకప్పుతో కూడిన వెయిటింగ్ హాల్ ఆధునీకరణ, ఆసుపత్రి వార్డుల్లో వాష్‌రూమ్‌ల మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ పనులను ఏపీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే కొత్తవలస మండలం మంగళపాలెం ఎంపీపీ పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. సమగ్ర శిక్షా విభాగం పర్యవేక్షణలో ఆరు నూతన తరగతి గదులతో పాటు ప్రత్యేక వాష్‌రూమ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

నియోజకవర్గంలో విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు తన అభ్యర్థన మేరకు నిధులు కేటాయించిన ఎంపీ శ్రీభరత్‌కు ఎస్.కోట ప్రజల తరఫున ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కృతజ్ఞతలు తెలిపారు. మంజూరైన పనులను నాణ్యతా ప్రమాణాలతో, ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.