అవాంఛనీయ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ నాగమల్లేశ్వరరావు.
సూర్య న్యూస్ దర్శి.
త్వరలో జరగబోవు మున్సిపల్, జడ్పిటిసి ఎంపిటిసి ,గ్రామపంచాయతీ ఎన్నికలలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు. దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ .నాగమల్లేశ్వరరావు దర్శి ఎస్ ఐ జి. ఏడుకొండలు స్థానిక పోలీస్ స్టేషన్ కు పిలిపించి త్వరలో జరగబోవు ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న ,ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యక్రమాలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.