BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష

Select Suryaa Now
ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష

*పేదల విద్య, వైద్యం ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట* 

*సీఎం చంద్రబాబు పేదలకు మేలు చేస్తుంటే..గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోంది* 

*మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* 

*ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి* 

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే  సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. 89 మంది లబ్ధిదారులకు రూ. 30.60 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....కూటమి ప్రభుత్వం వచ్చాక కొండపి నియోజకవర్గం లో ఇప్పటివరకు 2,560 మందికి రూ. రూ.20.37 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైద్యం కోసం పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని సీఎం చంద్రబాబు పెద్ద మొత్తంలో సీఎంఆర్ నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే  సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అని, పేదల విద్య, వైద్యం ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందిన్నారు. పి 4 తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు పేదలకు మేలు చేస్తుంటే..గొడ్డలి పార్టీ ఓర్వలేక రాష్ట్రంలో అసత్యాలు, అబద్ధాలు చేస్తోందని మండి పడ్డారు.  వైసీపీ ఓ విషవృక్షం, ప్రజలు దాన్ని  స్థానిక ఎన్నికల్లో కూకటి వేళ్ళతో పెకిలించాలని, లేకుంటే రాష్ట్రానికి ప్రమాదకరమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.