జర్నలిస్ట్ ఆర్కే ను పరామర్శించిన రాజా, వేణు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
ధవళేశ్వరం పరిధిలోని ఎర్రగొండలో అనారోగ్యంతో బాధపడుతున్న కేటీవీ జర్నలిస్టు కే. రామకృష్ణ (ఆర్‌కే)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదివారం పరామర్శించారు.
ఇటీవల గుండె సంబంధిత సమస్యతో స్టెంట్ వేయించుకున్న ఆర్‌కే స్వగృహానికి వెళ్లిన వారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.