BREAKING
చల్లా బాబుని కలిసిన పుంగనూరు టిడిపి నాయకులు తీరప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు --తోకతిప్ప వద్ద రూ.8 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మంత్రులకు స్వాగతం పలికిన మాస్టారు కొండపల్లి శివాజీ మహారాజ్‌ ప్రజా నాయకుడు.. మతానికి పరిమితం చేయొద్దు కండ్లకోయలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. భక్తులతో కిక్కిరిసిన మండపం శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారుకి పట్టు చీర సమర్పించిన చాట్రాతి కుటుంబ సభ్యులు కేతగుడిపిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 45 కుటుంబాలు!* బేతపూడి - రావి అనంతవరం బీటీ రహదారిని ప్రారంభించిన మంత్రులు దుద్దెడ శంభులింగేశ్వర క్షేత్ర కోనేరు పునర్నిర్మాణానికి సన్నాహాలు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్.చెక్కులు పంపిణీ ఖమ్మంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత గంధ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బి. ఎన్ సోషల్ మీడియా సమాచారపై జాగ్రత్తగా ఉండాలి:* ఎస్ఐ మహేష్

రవితేజ 'తులాభారం' గ్రాండ్ లాంచ్.. 'మాస్' నుంచి 'క్రైమ్ మహారాజా'గా కొత్త అవతారం!

Select Suryaa Now
రవితేజ 'తులాభారం' గ్రాండ్ లాంచ్.. 'మాస్' నుంచి 'క్రైమ్ మహారాజా'గా కొత్త అవతారం!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ఆర్టీ78 అధికారికంగా ప్రారంభమైంది. విభిన్న కథాంశాలతో అలరించే వివేక్ ఆత్రేయ మేకింగ్, రవితేజ ఎనర్జీ కలగలిసి రాబోతున్న ఈ సినిమాకు తులాభారం అనే క్రియేటివ్ టైటిల్‌ను ఖరారు చేశారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఇరుముడి చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సరికొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం విశేషం.

ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ ఎంతో వినూత్నంగా డిజైన్ చేశారు. మై హోమ్ రామ్ చేతుల మీదుగా ది టైటిల్ డాక్యుమెంటరీ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. కథకు తులాభారం అనే పేరును ఖరారు చేసే క్రమంలో చిత్ర బృందం మధ్య జరిగిన సరదా సంభాషణలను, వినోదాత్మక సన్నివేశాలను ఈ వీడియోలో చూపించి ఆకట్టుకున్నారు. ఈ విభిన్నమైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

ఈ టైటిల్ డాక్యుమెంటరీ ద్వారా సినిమాలో నటించే కీలక నటీనటుల వివరాలను కూడా వెల్లడించారు. జడేజాగా అనిల్ కరెళ్ల, రాబిన్‌గా రవి ఆంటోనీ, సౌండ్‌గా అనస్వర రాజన్ నటిస్తుండగా, దేవరాజ్‌గా తరుణ్ భాస్కర్, శివాజీ రావుగా జేడీ చక్రవర్తి, కృష్ణవేణిగా ప్రియాంక మోహన్ కనిపించనున్నారు. దశాబ్దాలుగా మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన రవితేజ, ఈ చిత్రంతో క్రైమ్ మహారాజాగా సరికొత్త ఐడెంటిటీ తెచ్చుకోబోతున్నారు. నవ రవితేజం అంటూ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఈ సినిమా, ఆయనను మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో ఆవిష్కరించనుంది.

హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా నిర్మాణ పనులు అధికారికంగా షురూ అయ్యాయి. ఈ ముహూర్తపు వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేయగా, చందు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ హీరో శ్రీ విష్ణు తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా, దర్శకులు శివ నిర్వాణ, బాబీ సంయుక్తంగా మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వరుస హిట్ ఆల్బమ్స్ అందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. తేని ఈశ్వర్ ఐఎస్సీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటింగ్‌ బాధ్యతలను, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలను చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుండగా, ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.