BREAKING
పంజాగుట్ట జివికె వన్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా పథకం కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ బి.ఎం.సందీప్‌ ను మర్యాదపూర్వకంగాకలిసిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ కు ఆహ్వానం గల్ఫ్‌లో విదేశీ సైనిక బలగాలపై ఇరాన్ హెచ్చరిక.. నౌకా దళం విస్తరణకు దక్షిణ కొరియా సన్నాహాలు: తుర్కియే కీలక ఆమోదం.. పాకిస్థాన్, సౌదీ అరేబియాతో సంయుక్త రక్షణ ఒప్పందం అమలుకు మార్గం సుగమం: మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు

తిరుమలలో ఘనంగా 'నాద నీరాజనం'.. ఆర్‌పీ పట్నాయక్, ఉదయభాను బృందానికి టిటిడి సత్కారం!

Select Suryaa Now
తిరుమలలో ఘనంగా 'నాద నీరాజనం'.. ఆర్‌పీ పట్నాయక్, ఉదయభాను బృందానికి టిటిడి సత్కారం!

సూర్య ఆధ్యాత్మిక డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని నాద నీరాజనం వేదికపై శనివారం సాయంత్రం భక్తిభావంతో సాగిన ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. శ్రీవారి సన్నిధిలో ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ 'నాద నీరాజనం' కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్, కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ నటి, యాంకర్ ఉదయభానులతో పాటు వారి బృందాన్ని టిటిడి అధికారులు ఘనంగా సత్కరించారు.

ఈ వేడుక ముగిసిన అనంతరం టిటిడి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ శ్రీధర్ వర్మ, టిటిడి బోర్డు మెంబర్ నన్నపనేని సదాశివరావుల చేతుల మీదుగా కళాకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. స్వామివారి నాద నీరాజనంలో పాల్గొని తమ మధురమైన గాత్రంతో, నైపుణ్యంతో భక్తులను ఆధ్యాత్మిక ఓలలాడించిన సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్, హోస్ట్ ఉదయభానుతో పాటుగా ప్రసిద్ధ గాయకులు నిహాన్, సాయి చరణ్, అగ్ని, శ్రీవిద్యలను అధికారులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఆపదమొక్కులవాడైన తిరుమల శ్రీవారి దివ్య సన్నిధిలో, నాద నీరాజనం లాంటి పవిత్రమైన వేదికపై స్వామివారి సేవలో పాలుపంచుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని, ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రత్యక్షంగా విచ్చేసిన భక్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది భక్తులు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ఈ సంగీత నివాళిని వీక్షించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.  

ఈ కార్యక్రమంలో టిటిడికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఎస్వీబీసీ ప్రతినిధులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. శ్రీవారి కొలువులో సాగిన ఈ భక్తి రసార్ద్ర సంగీత విభావరి తిరుమల గిరులలో ఆధ్యాత్మిక శోభను మరింత పరిమళింపజేసిందని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రసిద్ధ సాంస్కృతిక కార్యక్రమాలను నాద నీరాజనం వేదికపై భక్తులకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.