స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేయాలి
ఆత్రేయపురం మేజర్ న్యూస్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అభివృద్ధికి చేదోడునందించాలనే దృక్పథంతో తెలుగుదేశం పార్టీ వైపు వైసీపీకి చెందినవారు ఆకర్షితులవుతున్నారని ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వెలిచేరు సొసైటీ అధ్యక్షుడు నాగిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం గ్రామంలో ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించారు 86 అర్జీలు వచ్చాయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో కనబడిన వారి కల్లా ముద్దులు పెట్టి 2019లో ప్రజలను మాయ చేసే అధికారంలోకి వచ్చారని విమర్శించారు. గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పాతిక సంవత్సరాలు వెనక్కి నెట్టారని విమర్శించారు. జగన్ పాలన అనగానే అరాచకాలు, అవినీతి, బడుగు బలహీనవర్గాలపై దాడులు, గుంతల రోడ్లు, రాష్ట్రం నుంచి తరిమేవేసిన కంపెనీలు, పిల్లలకిచ్చే చిక్కీ మొదలు పట్టాదారు పాసుపుస్తకం వరకు జగన్ బొమ్మలు గుర్తుకు వస్తాయన్నారు. ప్రజలు అధికారానికి దూరం చేసినా,11 సీట్లకే పరిమితం చేసినా జగన్ లోనూ, గొడ్డలి పార్టీ నాయకుల్లోనూ మార్పు రాలేదన్నారు.
ఇప్పటికీ రప్పా, రప్పా అంటూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారన్నారు. అందుకే ఆ పార్టీ నాయకులు సైతం విరక్తి చెంది కూటమి పార్టీల్లోకి చేరుతున్నారన్నారు. నేడు తెలుగుదేశం పార్టీలో చేరినవారంతా స్థానిక నాయకులు, కార్యకర్తలతో మమేకమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు ద్వారా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్లాలన్నా, గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల గెలుపు తప్పనిసరని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల కుటుంబమని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి మండల టిడిపి అధ్యక్షులు కూసం పూడి రామకృష్ణంరాజు రాష్ట్ర టి ఎన్ టి యు సి కార్యనిర్వహక కార్యదర్శి ముల్లపూడి భాస్కరరావు జిల్లా ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు కరుటూరి నరసింహారావు తెలుగు యువత అధ్యక్షులు వెచ్చా అనిల్ నీటి సంఘం అధ్యక్షులు జోజవరపు హరిబాబు మండల టిడిపి ఉపాధ్యక్షులు తోట రజిని మాజీ సర్పంచ్ నరాలశెట్టి వెంకన్న మాజీ ఎంపీపీ వాకలపూడి వెంకటకృష్ణారావు మద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ మెర్ల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు