BREAKING
తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియామకం యూరోపియన్ యూనియన్‌కు 5,841 టన్నుల చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతి: టీఆర్‌క్యూ కింద రాయితీ సుంకంతో ఎగుమతులు! 28 రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న యూట్యూబర్ నందన.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ వైరల్! హెచ్‌సీఎల్‌టెక్ జోరు: పూర్తి స్థాయి రాబడి వృద్ధి అంచనా (గైడెన్స్) 2.5–4 శాతానికి పెంపు.. ఎబిట్ మార్జిన్ల ఔట్‌లుక్ యథాతథం! దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చిన్న వయసులోనే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. మన జీవనశైలిలో జరుగుతున్న తీవ్రమైన పొరపాట్లు ఇవే! బ్రిటన్‌లో బోనస్‌ పరిమితి రద్దు: ఉద్యోగుల 'ఫిక్స్‌డ్ పే అలవెన్సులు' ఎత్తివేయనున్న హెచ్‌ఎస్‌బీసీ.. 2028 నుంచి పెరగనున్న బోనస్‌ల వాటా! ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! ఆసరాగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం

ప్రజలకు మెరుగైన అంతరాయం లేకుండా విద్యుత్

Select Suryaa Now
ప్రజలకు మెరుగైన అంతరాయం లేకుండా విద్యుత్

రేపల్లె, మేజర్ న్యూస్;
ప్రజలకు మెరుగైన విద్యుత్తును, అంతరాయం లేకుండా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను సహచర మంత్రులు ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రెవిన్యూ శాఖ మంత్రి అనగానీి సత్యప్రసాద్ ల తో కలిసి ప్రారంభించారు అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ రు.56.76 కోట్లతో 27 కిలోమీటర్ల మేర హైలెవెల్ టవర్స్ తో విద్యుత్తు లైన్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఏడాది వరద సమయంలో రేపల్లె నియోజకవర్గం ప్రజలు ఇబ్బందులు పడ్డారని, సీఎం దృష్టికి తీసుకెళ్లగానే తక్షణమే మంజూరు చేశారన్నారు. ప్రజలకు మేలు చేయడానికి కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో విద్యుత్ బిల్లులలో ఒక రూపాయి పెంచలేదన్నారు. విద్యుత్ చాలక పోయినప్పటికీ బయటనుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. సబ్ స్టేషన్, 132 కెవి సబ్ స్టేషన్ రేపల్లెలో నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. రూ.56 కోట్లతో హై లెవెల్ విద్యుత్ టవర్లు, లైన్లు ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారుఈ కార్యక్రమంలో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.