BREAKING
మీ రాక మాకు పండుగ జనసేన విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి గడ్డమణుగు రవికుమార్ షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ గా వెంకటేశ్వర్లు... కేశంపేట సిఐ గా శ్రీనివాస్.. దుర్గమ్మ కరుణా, కటాక్షం ప్రజలందరిపై ఉండాలి ప్రజలకు మెరుగైన అంతరాయం లేకుండా విద్యుత్ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేయాలి ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం జర్నలిస్ట్ ఆర్కే ను పరామర్శించిన రాజా, వేణు సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

భగవద్గీత అధ్యయనంతోనే ఉత్తమ విద్యార్థిగా ఎదుగుతారు

Select Suryaa Now
భగవద్గీత అధ్యయనంతోనే ఉత్తమ విద్యార్థిగా ఎదుగుతారు

 చిన్మయ గీతా పఠన పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో వక్తలు
 ఘనంగా పాఠశాల, జిల్లా స్థాయి విజేతలకు బహుమతుల పంపిణీ
విజయనగరం ,మేజర్ న్యూస్: చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'చిన్మయ గీతా పఠన పోటీలు – 2026' స్కూల్ మరియు జిల్లా స్థాయి విజేతల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం స్థానిక ఆంధ్రా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న చిన్మయ మిషన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మహారాజా స్వయంప్రతిపత్తి (ఎం.ఆర్) కళాశాల ప్రిన్సిపాల్ ముక్కామల సాంబశివరావు, ఇన్స్పైరో స్కూల్ ప్రిన్సిపాల్ మరియు అకాడమిక్ డైరెక్టర్ మందా రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ — "చిన్మయ మిషన్ సంస్థ క్రమశిక్షణకు, ఆధ్యాత్మిక విలువల పెంపొందింపునకు మారుపేరుగా నిలిచింది. భగవద్గీత పఠనం విద్యార్థులలో ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు నైతిక విలువలను పెంపొందిస్తుంది. పోటీలలో గెలుపోటముల కంటే భాగస్వామ్యం వహించడమే ప్రధానమని, ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరూ విజేతలే" అని కొనియాడారు.
ఈ కార్యక్రమాన్ని చిన్మయ మిషన్ కన్వీనర్ స్వామి విజయానంద సరస్వతి పర్యవేక్షణలో మిషన్ సభ్యులు ఎంతో శ్రద్ధతో నిర్వహించారు. పాఠశాల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, చిన్నారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ సేవకులు లింగరాజు, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.