BREAKING
మీ రాక మాకు పండుగ జనసేన విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి గడ్డమణుగు రవికుమార్ షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ గా వెంకటేశ్వర్లు... కేశంపేట సిఐ గా శ్రీనివాస్.. దుర్గమ్మ కరుణా, కటాక్షం ప్రజలందరిపై ఉండాలి ప్రజలకు మెరుగైన అంతరాయం లేకుండా విద్యుత్ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేయాలి ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం జర్నలిస్ట్ ఆర్కే ను పరామర్శించిన రాజా, వేణు సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

పార్వతీపురం అభివృద్ధికి రూ. 152 కోట్లు నిధులు తెచ్చాం

Select Suryaa Now
పార్వతీపురం అభివృద్ధికి రూ. 152 కోట్లు నిధులు తెచ్చాం

రూ. 2 కోట్లకు పైగా నిధులతో వివిధ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు

ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

పార్వతీపురం, మేజర్ న్యూస్ : పార్వతీపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని శాసనసభ్యులు బోనెల విజయచంద్ర తెలిపారు. ముందుగా ఆయన ప్రజలందరికీ నవరాత్రి ప్రారంభధినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్వతీపురం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా బెలగాం నుంచి రాయగాడ రోడ్డు వరకు (డంపింగ్ యార్డ్ వరకు) దాదాపు రెండు కిలోమీటర్ల పైగా ఉన్న ప్రధాన రహదారి సంపూర్ణ పునర్నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయిలకు పైగా నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అలాగే నర్సిపురం ఎస్సీ వీధిలో రూ. 10 లక్షలు, బీసీ కాలనీలో రూ. 10 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణం, మరియు ఓలేటి  ఫామ్ అమ్మవారి పేరంటాలు గుడి  వద్ద రూ. 48 లక్షలతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో రూ. 152 కోట్ల నిధులను తీసుకురావడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరో రూ. 2.5 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే విజయచంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు