విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి:
తె ర్లాం, మేజర్ న్యూస్ : ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పోటీలు గ్రంథాల అధికారి సిహెచ్ కృష్ణమూర్తి నిర్వహించారు ఆదివారం చదవడం మాకిష్టం అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా నెహ్రూ అబ్రహం లింకన్ గాంధీ జీవిత చరిత్రలపైన క్విజ్ నిర్వహించి విద్యార్థులలో విజ్ఞాన వికాసాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకున్నారు. అలాగే దేశభక్తి గేయాలు చిత్రలేఖనం వ్యాసరచన వంటి పోటీలను కూడా ఏర్పాటు చేసి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతోపాటు పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు.