BREAKING
అవాంఛనీయ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ నాగమల్లేశ్వరరావు. అధిష్టానం ఆదేశిస్తే .. మా కుటుంబంలోనే మున్సిపల్ చైర్మన్ మీ రాక మాకు పండుగ జనసేన విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి గడ్డమణుగు రవికుమార్ షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ గా వెంకటేశ్వర్లు... కేశంపేట సిఐ గా శ్రీనివాస్.. దుర్గమ్మ కరుణా, కటాక్షం ప్రజలందరిపై ఉండాలి ప్రజలకు మెరుగైన అంతరాయం లేకుండా విద్యుత్ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేయాలి ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం జర్నలిస్ట్ ఆర్కే ను పరామర్శించిన రాజా, వేణు సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం

జిల్లా ఏర్పాటై పదేళ్లు.. అభివృద్ధి శూన్యం.. మరో ఉద్యమం తప్పదు: వీడీడీఎఫ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌

Select Suryaa Now
జిల్లా ఏర్పాటై పదేళ్లు.. అభివృద్ధి శూన్యం.. మరో ఉద్యమం తప్పదు: వీడీడీఎఫ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11):

వికారాబాద్‌ జిల్లా ఏర్పాటు కావడం హర్షణీయమైన విషయమే అయినప్పటికీ.. జిల్లా అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆక్షేపణీయమని వికారాబాద్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం (వీడీడీఎఫ్‌) చైర్మన్‌ శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా ఏర్పాటై పదేళ్లు గడుస్తున్నా కలెక్టరేట్‌, ప్రభుత్వ వైద్య కళాశాల మినహా చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మరో ప్రజా ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 1978లో ఏర్పడినప్పటి నుంచి 2016 వరకు వికారాబాద్‌ జిల్లా కేంద్రం కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉండేదని శ్రీనివాస్‌ గుర్తుచేశారు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి లోపం, సమన్వయ రాహిత్యం కారణంగా దశాబ్దాల పాటు జిల్లా కేంద్రం కల నెరవేరలేదన్నారు. 2010లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో వికారాబాద్‌ జిల్లా సాధన కోసం ప్రత్యేక వేదిక అవసరమని భావించి వికారాబాద్‌ జిల్లా ఫోరం (వీడీఎఫ్‌) ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఫోరం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, పశ్చిమ రంగారెడ్డి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి జిల్లా ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాలు చేయించినట్లు తెలిపారు. అప్పటి మంత్రి సబితారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కలిసి జిల్లా ఆవశ్యకతను వివరించామని చెప్పారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలోనూ ఫోరం ప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా ఏర్పాటు అంశంపై ఆశలు చిగురించాయని, 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశామని శ్రీనివాస్‌ తెలిపారు. అదే సమయంలో శంషాబాద్‌ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తెరపైకి రావడంతో వికారాబాద్‌ జిల్లా ఏర్పాటు సందిగ్ధంలో పడిందన్నారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ప్రభుత్వ పెద్దలకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలు అందజేస్తూ ఒత్తిడి తీసుకువచ్చామని వివరించారు. చివరకు 2016 అక్టోబర్‌ 11న ప్రభుత్వం ప్రకటించిన 33 జిల్లాల్లో వికారాబాద్‌కు చోటు దక్కిందని తెలిపారు.అయితే ఫోరం కోరుకున్న విధంగా జిల్లా ఏర్పాటు కాలేదని, భౌగోళికంగా అసమతుల్యత కలిగిన జిల్లాను రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్‌కు సమీపంలోని చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలవగా, దూరంగా ఉన్న కొడంగల్‌, దౌల్తాబాద్‌ తదితర ప్రాంతాలను వికారాబాద్‌ జిల్లాలో చేర్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ వెనుకబడిన జిల్లాగా ప్రత్యేక నిధులు వస్తాయని, అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశించామని తెలిపారు.

జిల్లా సాధన అనంతరం అభివృద్ధి లక్ష్యంగా వికారాబాద్‌ జిల్లా ఫోరాన్ని వికారాబాద్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం (వీడీడీఎఫ్‌)గా మార్చినట్లు చెప్పారు. జిల్లా ఏర్పాటును పురస్కరించుకుని వికారాబాద్‌ బ్లాక్‌ గ్రౌండ్‌లో దాదాపు 10 వేల మంది ప్రజలు, విద్యార్థులతో సంబరాలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. జిల్లా సాధన ఉద్యమంలో తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్‌ కె. శ్రీనివాస్‌, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకుడు శుభప్రద పటేల్‌, న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, వ్యాపారవేత్త తస్వర్‌ అలీ, దేవకీదేవి, నర్సింలు, రామ్‌చందర్‌, స్వర్గీయ రామారావు జోషి, స్వర్గీయ నాగభూషణంతో పాటు పలువురు ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నాయకులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం బాధాకరమని శ్రీనివాస్‌ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ వికారాబాద్‌ జిల్లా కేంద్రంగా జరగాల్సిన అభివృద్ధి కొడంగల్‌ కేంద్రంగా కొనసాగుతోందని ఆరోపించారు. దీనిపై వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రం అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లాకు రావాల్సిన నిధులు, పరిశ్రమలు, విద్యా, వైద్య సదుపాయాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.కొడంగల్‌ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో వికారాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తరహాలోనే జిల్లా అభివృద్ధి కోసం ప్రజలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మేధావులు, యువత, విద్యావంతులు, ప్రజా సంఘాలు సమన్వయంతో ఉద్యమిస్తేనే వికారాబాద్‌ జిల్లాకు న్యాయం జరుగుతుందని, ప్రజల చిరకాల ఆకాంక్షలు నెరవేరుతాయని వీడీడీఎఫ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

 

కుమ్మరి రాఘవేందర్ , వికారాబాద్ జిల్లా ప్రతినిధి.