BREAKING
రబిలో ఆరుతడి పంటలే మేలు! గ్రైండర్ డేటా షేరింగ్ వివాదం...మైక్రోసాఫ్ట్ 'జాండర్' సంస్థకు నార్వే భారీ జరిమానా ఈవోని కలిసిన దేవస్థాన కమిటీ సభ్యుడు బీజేవైఎం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా మణి మోదీ వెంకటేశ్వర దేవాలయం కు ఎమ్మెల్యే శంఖు స్థాపన అన్నపూర్ణా దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు పొదలకూరు దశ, దిశ మారుస్తోన్న సోమిరెడ్డి ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న ప్రోత్సాహకాలే అసలు సమస్య కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ బాధ్యతల స్వీకరణ. సెలవుల్లో కంప్యూటర్‌ పాఠాలు మున్సిపాలిటి చైర్మన్‌ పదవి బీసీ మహిళకు కేటాయింపు! కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ చివరి సీజన్.. మొదటి గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్! నైజీరియా డాంగోట్ ఆయిల్ రిఫైనరీ ఐపీఓ గడువు మరో 10 రోజులు పొడగింపు రష్యా ముప్పుపై నాటో జనరల్ కఠిన హెచ్చరిక పెనుగొండ సీహెచ్‌సీలో శాశ్వత గైనకాలజిస్ట్‌ను నియమించాలి : సిపిఎం మండల కార్యదర్శి షేక్ పాదుషా డిమాండ్

2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా బ్యూరో,

Select Suryaa Now
2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.       నల్గొండ జిల్లా బ్యూరో,

2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం...
#.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు.
#. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.       నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
తెలంగాణలోని  అన్ని రహదారులను అభివృద్ధి చేస్తామని, నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామానికి డబుల్ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.  జూన్ , 2028
నాటికి శ్రీశైలం సొరంగ మార్గం పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు.ఆదివారం  ఆయన నల్గొండ జిల్లాలో  74 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.ముందుగా మంత్రి కనగల్ మండలం తేలకంటిగూడెం  వద్ద 41 కోట్ల రూపాయలతో  తెలకంటిగూడెం నుండి తొరగల్లు, జంగమాయి గూడెం మీదుగా ముషంపల్లి గ్రామం వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ మరియు పటిష్టపరిచే పనులకు  శంకుస్థాపన చేశారు. 
అలాగే  33 కోట్ల రూపాయలతో నల్గొండ-నిడమానూరు రోడ్డు నుండి చెట్ల చెన్నారం, చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి గ్రామం వరకు చేపట్టే రోడ్డు విస్తరణ , పటిష్టపరిచే పనులకు శేరి లింగోటం వద్ద శంకుస్థాపన  చేశారు. 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  నల్లగొండ జిల్లాలో 1600  కోట్ల రూపాయలతో  రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం , స్వయం సహాయక సంఘాలకు  వడ్డీలేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాగునీటిని వృథా చేయకుండా కాపాడుకోవాలని, పంటలను రక్షించుకునేందుకు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని రైతులతో కోరారు. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ, పరిసర గ్రామాల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకున్నామని   తెలిపారు.శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించవచ్చని  చెప్పారు. సొరంగ మార్గం పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే తన సంకల్పమన్నారు. రైతులు సంతోషంగా ఉండాలని, పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి  తెలిపారు.జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడారు.ఆర్ అండ్ బి ఎస్ ఈ. మోహన్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీధర్ రెడ్డి , కనగల్ తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షత, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు ఉన్నారు.