BREAKING
దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు! ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్ దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు బాక్సాఫీస్ వద్ద రూ. 480 కోట్లు దాటిన దృశ్యం 3.. అజయ్ దేవగన్ నటనపై మోహన్‌లాల్ ప్రశంసల జల్లు! అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం పిల్లలకు బయట ఆటలు ఎందుకు ముఖ్యం.. శారీరక, మానసిక వికాసానికి అవుట్‌డోర్ గేమ్స్ ఎంత అవసరం! సిఐఐ సదస్సులో పాల్గొన్న విప్ నాయకర్ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు: ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులకే జెఫరీస్ ప్రాధాన్యం.. ఎందుకంటే? ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కచ్చితంగా కైవసం చేసుకుంటుంది ‎ఏలూరు పార్లమెంటు పరిధిలో రూ. 20 కోట్ల రోడ్ల పనులకు అనుమతి -ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్

రబిలో ఆరుతడి పంటలే మేలు!

Select Suryaa Now
రబిలో ఆరుతడి పంటలే మేలు!

వరికి బదులు స్వల్పకాలిక పంటలు సాగు చేయాలి యాసంగి సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా స్వల్పకాలిక ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. మండలంలోని మంచాల, బోడకొండ, ఆరుట్ల రైతు వేదికల్లో రైతులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవగాహన కల్పించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్‌ జాజు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుతూ.. బోరుబావుల కింద వరి సాగు చేసే రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ పంటకాలం ఉండే ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం అక్కడక్కడ పంటలు ఎండిపోతున్నాయని, బోర్లలో నీరు పుష్కలంగా ఉందని దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎల్‌నినో ప్రభావంతో బోర్లు ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పెసర, మినుము, అలసంద, కొర్ర, సజ్జ, నువ్వులతో పాటు కూరగాయలు సాగు చేస్తే 70 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుందని తెలిపారు. తద్వారా నీటి వినియోగం తగ్గడంతో పాటు వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టాలను కొంతవరకు నివారించవచ్చన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను త్వరలోనే అన్ని మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ వెదిరే హనుమంత్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్‌, బోడకొండ సర్పంచ్‌ జయచందర్‌, ఉప సర్పంచ్‌ రవి, ఆరుట్ల సర్పంచ్‌ శోభ, ఉప సర్పంచ్‌ రాజు, విద్యుత్‌, సాగునీటి, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు, ఏఈవోలు, ఉద్యాన శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల సీసీలు, రైతులు పాల్గొన్నారు.