దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా
కడియం, మేజర్ న్యూస్, కడియం మండలం దుళ్ల గ్రామంలో రాష్ట్ర పచ్చదనం, సుందరీకరణ సంస్థ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ సోమవారం పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచారు. తొలుత దుళ్ల మార్కెట్ సెంటర్‌లోని శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.
తన కుమారుడిని కోల్పోయి పుత్రవియోగంతో బాధపడుతున్న వైకాపా కార్యకర్త చాపల ముసలయ్యను పరామర్శించి ఓదార్చారు. ముసలయ్య కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు.
అనంతరం మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఇందుప్రియను పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులు జయప్రకాష్, దుర్గలను ఓదార్చి, అమ్మాయి వైద్యానికి అవసరమైన సహాయం అందించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అధైర్యపడవద్దని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ అసంబ్లీ నియోజకవర్గ వైస్సార్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు టేకి శ్రీనివాసరరావు, తాతపూడి బాబి,మాజీ ఎంపీటీసీ మాజీ వైస్సార్ గ్రామ అధ్యక్షుడు కంటిపూడి సాయిరామ్,
శ్రీ శారదా దేవి అమ్మవారి ఆలయ పూజారి పడాల ప్రసాద్,దేవాంగ సంఘ అధ్యక్షులు మాడా మల్లి బాబురావు,కమిటీ సభ్యులు చందన సత్తిబాబు, తొట్టా సత్తిబాబు, కవిలి సతీష్, కొరుప్రోలు పుల్లం, తోకల శ్రీనివాస్, స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.