దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు
అనపర్తి, మేజర్ న్యూస్.దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం అనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి పీఠాలను అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తొలుత పొలమూరు గ్రామంలోని దేవి సెంటర్‌లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్తి కనకారెడ్డి, సత్తి సత్యనారాయణ రెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, సత్తి నాగిరెడ్డి, తాడి దుర్గారెడ్డి, తాడి వెంకటరెడ్డి, తాడి హరినాథరెడ్డి, తాడి లచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రామవరం గ్రామంలోని చెరువు వీధిలో దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్న చండీయాగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు చిర్లపల్లి త్రిమూర్తి శర్మ, దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.అదేవిధంగా అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) నివాసంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి పీఠాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆలయాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు
పొలమూరు, రామవరం గ్రామాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు
అనపర్తి, గోధూళి: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం అనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి పీఠాలను అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తొలుత పొలమూరు గ్రామంలోని దేవి సెంటర్‌లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్తి కనకారెడ్డి, సత్తి సత్యనారాయణ రెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, సత్తి నాగిరెడ్డి, తాడి దుర్గారెడ్డి, తాడి వెంకటరెడ్డి, తాడి హరినాథరెడ్డి, తాడి లచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అనంతరం రామవరం గ్రామంలోని చెరువు వీధిలో దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్న చండీయాగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు చిర్లపల్లి త్రిమూర్తి శర్మ, దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.అదేవిధంగా అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) నివాసంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి పీఠాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆలయాలు, అమ్మవారి పీఠాలకు తరలివస్తున్నారు.