BREAKING
రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు. యూఎస్ యూ తనిఖీ నుంచి ఇటలీ నిష్క్రమణకు ముప్పు-సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య. సెప్టా సంక్షోభం సమయంలో స్పానిష్ జలాల్లోకి మొరాకో నావికాదళ నౌకలు అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్. హనుమాన్ నగర్‌లో మహిళల చే దసరా వేడుకలు ప్రజా నాయకుడు కన్నుమూత! కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్.. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం

Select Suryaa Now
ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం

నరసాపురం, మేజర్ న్యూస్ :స్థానిక శ్రీ వై ఎన్ కళాశాల జంతుశాస్త్ర విభాగం, జలచర పెంపక శాఖ ఐ.క్యూ.ఎ.సి. ఆధ్వర్యంలోకార్పొరేట్ ప్రదర్శన & రొయ్యల ఆరోగ్యం, వ్యాధి నిర్వహణ' అనే అంశంపై ఒకరోజు కార్యశాలను సోమవారం నిర్వహించారు.కర్ణాటక కు చెందిన  విర్బాక్ యానిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్, ప్రాంతీయ వ్యాపార నిర్వాహకుడు  టి. దామోదర రావు ముఖ్య అతిదులుగా విచ్చేసి, రొయ్యల పెంపకంలో  గరిష్ట దిగుబడి, లాభాలను సాధించాలంటే రొయ్యల ఆరోగ్యం  సమర్థవంతమైన వ్యాధి నిర్వహణ అత్యంత కీలకమైన అంశాలని అన్నారు. చెరువులో నీటి నాణ్యత లోపించడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల రొయ్యలు రకరకాల వ్యాధుల బారిన పడి రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయని,రొయ్యలకు రోగనిరోధక వ్యవస్థ  ఉండదు, కాబట్టి వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే రాకుండా నివారించడమే ఏకైక మార్గమని వారు తెలిపారు.రొయ్యలను ఆశించే వైట్ స్పాట్, ఇ. హెచ్. పి., వైబ్రియోసిస్, తెల్ల విసర్జన వ్యాధి, తెల్ల కండరవ్యాధి వంటి వ్యాధుల లక్షణాలపై అవగాహన కలిగి,  నివారణా చర్యలైన ముందస్తు ఆరోగ్య రక్షణ యాజమాన్య పద్ధతులైన, నమ్మకమైన హేచరీల నుండి తెచ్చిన, వ్యాధులు లేని  రొయ్య పిల్లలను మాత్రమే చెరువుల్లో వదలాలన్నారు.చెరువు చుట్టూ పీతలు, పక్షులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని,  ఒక చెరువు నీరు మరో చెరువులోకి కలవకుండా జీవ భద్రతను పాటించాలని, ఏరియేటర్ల ద్వారా ఆక్సిజన్ ను,  పి.హెచ్. స్థాయిలను సరిగా ఉండేలా చూసుకోవాలని, ప్రోబయోటిక్స్ వాడకం,  సరైన మేత వంటి విధానాలు రొయ్యల సాగును మరింత మెరుగుపరచడానికి ఉపకరిస్తాయని' తెలియజేశారు.పాలకొల్లు ఏరియా మేనేజర్ సిహెచ్. డి.ఎం. రాజు, నర్సాపురం టెక్నికల్ మేనేజర్  కె.విల్సన్ బాబు, అత్తిలి టెక్నీకల్ మేనేజర్ టి. సాయికిషోర్ రిసోర్స్ పర్సన్ గా పాల్గొని, విద్యార్థిని విద్యార్థులు చేత  ల్యాబ్ టెక్నికులను, చెరువుల వద్ద చేయవలసిన సాంకేతిక విషయాలను, పరికరాల వినియోగం గురించి నేర్పించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. పి. వి. అప్పారావు అధ్యక్షత వహించగా, ఐ. క్యూ. ఎ. సి. సమన్వయకర్త డా. గంధం శ్రీ రామకృష్ణ, జంతుశాస్త్ర శాఖాధ్యక్షురాలు  కె. ఎస్. ఎస్. వి. ఎన్. లక్ష్మి, అధ్యాపకురాలు సబ్ లెఫ్ట్ నెంట్ జి. సునీత, వృక్ష శాస్త శాఖాధ్యక్షలు డా.కె. భావనారాయణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా