ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్
నర్సాపురం, సూర్య న్యూస్:వివిధ ప్రాంతాల నుండి అధికారులపై నమ్మకంతో ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందజేస్తున్నారని, వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు అధికారులు కృషి చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో ఏడిద శ్రీనివాస్ అన్నారు. సోమవారం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 43 వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొనసాగిస్తుందని సంబంధిత శాఖల అధికారులు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. తమ కార్యాలయం నుండి ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపిస్తున్నామని, వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి లబ్ధిదారులకు న్యాయం చేయాలని శ్రీనివాస్ కోరారు. డివిజన్లోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా