BREAKING
హెచ్‌సీఎల్‌టెక్ జోరు: పూర్తి స్థాయి రాబడి వృద్ధి అంచనా (గైడెన్స్) 2.5–4 శాతానికి పెంపు.. ఎబిట్ మార్జిన్ల ఔట్‌లుక్ యథాతథం! దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చిన్న వయసులోనే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. మన జీవనశైలిలో జరుగుతున్న తీవ్రమైన పొరపాట్లు ఇవే! బ్రిటన్‌లో బోనస్‌ పరిమితి రద్దు: ఉద్యోగుల 'ఫిక్స్‌డ్ పే అలవెన్సులు' ఎత్తివేయనున్న హెచ్‌ఎస్‌బీసీ.. 2028 నుంచి పెరగనున్న బోనస్‌ల వాటా! ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! ఆసరాగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం

‎ఏలూరు పార్లమెంటు పరిధిలో రూ. 20 కోట్ల రోడ్ల పనులకు అనుమతి -ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్

Select Suryaa Now
‎ఏలూరు పార్లమెంటు పరిధిలో రూ. 20 కోట్ల రోడ్ల పనులకు అనుమతి   -ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్

‎ఏలూరు, సూర్య న్యూస్ : వీబీ-జీ రామ్ జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా ఈ ఏడాది (2026-27) దాదాపు 20 కోట్ల విలువైన సీసీ రోడ్లకు అనుమతులు మంజూరు చేశామన్నారు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల కోడ్ రాకముందే  ఇప్పటి వరకూ మంజూరైన పనులను వెంటనే మొదలు పెట్టాలని నాయకులకు, అధికారులకు ఎంపీ సూచించారు. ఈ మేరకు ఏలూరు పార్లమెంటు పరిధిలోని 27 మండలాల టీడీపీ ఇన్‌ఛార్జిలు, నాయకులతో కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా మాట్లాడిన ఎంపీ, ఆ వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యేలు, మండల నాయకులు, ప్రజల నుంచి తన వద్దకు వచ్చిన వినతుల మేరకు దాదాపు అన్ని పనులు కూడా మంజూరు చేయడం జరిగిందని ఎంపీ స్పష్టం చేశారు. మంజూరు చేసిన పనుల వివరాలను ఎమ్మెల్యేలకి, మండల పార్టీ అధ్యక్షులకి, పార్టీ ఇంచార్జిలకు అందరికీ కూడా తన కార్యాలయం ద్వారా సమాచారం అందించామని చెప్పిన ఎంపీ, పనులు మంజూరు అయిన గ్రామాలలో వెంటనే శంకుస్థాపనలు చేసి, పనులు మొదలు పెట్టాలని కోరారు. 2026-27 ఏడాదికి  ఇప్పటి వరకూ మంజూరు చేసిన పనుల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం రూ.19.8 కోట్లు విలువైన సీసీ రోడ్లు మంజూరు చేసినట్లు ఎంపీ వివరించారు. పంచాయతీల తీర్మానాలు అందకపోవడం వల్ల పనులు మంజూరు కాని గ్రామాలకు రాబోవు రోజుల్లో రెండో విడతలో నిధులు మంజూరు చేస్తామని ఎంపీ తెలిపారు.గత ఏడాది భారీగా స్మశానవాటికలకు నిధులు కేటాయించామని, వాటి పనులు దాదాపు పూర్తికావచ్చాయని ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్ చెప్పారు. అయితే, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు స్మశానవాటికలకు నిధులు కేటాయించడంలేదన్నారు. స్మశానవాటికలకు రాబోవు రోజుల్లో మళ్ళీ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాలలో మండల నాయకులు, ఇంచార్జిలు గాని, సర్పంచులుగానీ, ప్రజలుగానీ ఎవరెవరు రోడ్లు అడిగారో వాళ్ళందరికీ కూడా సీసీ రోడ్లు మంజూరు చేశామని ఎంపీ స్పష్టం చేశారు. అన్ని పనులు వెంటనే మొదలుపెట్టాలని మండల పార్టీ నాయకులకు, పార్టీ ఇంచార్జిలకు ఎంపీ దిశానిర్ధేశం చేశారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు 

‎

‎