డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ
గోకవరం, మేజర్ న్యూస్ :యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందని ఈగల్ టీమ్ సీఐ పీవీ సూర్యమోహన్ అన్నారు. కమ్యూనిటీ పారా మెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పిఎంపి అసోసియేషన్ గోకవరం మండలం) ఆధ్వర్యంలో గోకవరం ఎమ్వీఆర్ ఫంక్షన్ హాల్ లో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు, డ్రగ్స్ పై వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎమ్వీఆర్ ఫంక్షన్ హాల్ నుండి పోలీసు స్టేషన్ మీదుగా పంచాయతీ ఆఫీస్ వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు, జిల్లా కోశాధికారి పి చిన్ని అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఈగల్ టీమ్ సీఐ పీవీ సూర్యమోహన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ కు నో చెప్పి మంచి భవిష్యత్తుకు ఎస్ చెప్పాలని కోరారు. అలాగే గ్రామాల్లో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే తెలియజేయాలని సూచించారు. గోకవరం ఎస్ఐలు వి పవన్ కుమార్, నాగమణి మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని పీఎంపీలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో ర్యాలీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాజమండ్రి ఆర్కా హాస్పిటల్ కు చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ మొల్లేటి రామ్ మోహన్ మాట్లాడుతూ గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రాధమికంగా ప్రధమ చికిత్సలందించే పీఎంపీలు సామాజిక సృహతో కూడిన కార్యక్రమాలు చేయడం అభినందించదగినదని అన్నారు. ఈసందర్బంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్ మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలలో భాగంగా గోకవరంలో ఈగల్ టీమ్,రెడ్ క్రాస్ వారితో కలిసి ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్ఐ నరేష్ కుమార్, మండల కార్యదర్శి ఎస్ సూరిబాబు, మండల కోశాధికారి జి లాజర్, రాజానగరం మండల కార్యదర్శి కాపా సత్యనారాయణ, కోశాధికారి ఎ నాగేశ్వరరావు, జి వెంకటేష్, జి నాని, ఎస్ అర్జునరావు, ఎన్ శ్రీనివాస్, జె మూర్తి, జె శర్మ, ది గోకవరం డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ మెంబర్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చక్రవర్తి, సెక్రటరీ సత్యనారాయణ, ఈసీ మెంబర్స్ లహరి మెడికల్స్ రాజేష్, గౌతమి మెడికల్ త్రినాథ్, అన్నపూర్ణ మెడికల్స్ శివరాం, సభ్యులు పాల్గొన్నారు