ఫ్లై ఓవర్ పై గుర్తుతెలియని శవం!
శంషాబాద్ పరిధిలోని కిషన్‌గూడ ఫ్లైఓవర్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఉదయం 7.55 గంటల సమయంలో సుమారు 50 నుంచి 55 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతిచెంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
ప్రాథమిక విచారణలో మృతుడు గత కొన్ని నెలలుగా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. అయితే, అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి వివరాలు గుర్తించడంతో పాటు మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోతుల నర్సింహా : మేజర్ న్యూస్, శంషాబాద్