ధారూర్ ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ
ధారూర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 12): ధారూర్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్‌ఐగా సురేష్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్‌శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా ప్రస్తుతం ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సున్నం రాఘవేందర్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో సురేష్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా నూతన ఎస్‌ఐ సురేష్ మాట్లాడుతూ… మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.