బంట్వారం ఎస్సైగా పుండ్లిక్ బాధ్యతల స్వీకరణ
బంట్వారం, మేజర్ న్యూస్ (అక్టోబర్ 12): బంట్వారం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా పుండ్లిక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏడాదికి పైగా ఎస్సైగా విధులు నిర్వహించిన విమల సైబరాబాద్‌కు బదిలీ కావడంతో ఆమె స్థానంలో పుండ్లిక్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతన ఎస్సై పుండ్లిక్ మాట్లాడుతూ… పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు.
రిపోర్టర్: శ్రీనివాస్ గౌడ్, బంటారం, వికారాబాద్ జిల్లా.