హనుమాన్ నగర్‌లో మహిళల చే దసరా వేడుకలు
ప్రొద్దుటూరు అక్టోబర్ 12 మేజర్ న్యూస్: పట్టణం లోని హనుమాన్ నగర్ వీధిలో కోతి సమాధి వద్ద స్థానిక మహిళలు శ్రీ దుర్గా విజయాంబిక కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు విజయదుర్గ అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మ వారి ప్రతిమ అలంకరణ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు ఉషారాణి, లక్ష్మీప్రసన్న, హారిక, రమ, అనురాధ, పద్మావతమ్మ, తేజ, అనిల్, వంశీ, సందీప్ రవి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప