రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు.
రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు.
రొంపిచెర్ల, మేజర్ న్యూస్: ప్రభుత్వం రీసర్వే ద్వారా రైతుల భూ సమస్యలను తగ్గించాలని ప్రయత్నాలు చేస్తుందని అయితే రెవిన్యూ అధికారుల వలన రీసర్వే పేరుకే అని తెలుస్తుందని రొంపిచెర్ల మండలం, బండకింద పల్లె గ్రామపంచాయతీ, మట్లోళ్లపల్లి కి చెందిన రైతు హరికృష్ణా రెడ్డి అన్నారు. ఆయన సోమవారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా తండ్రి వెంకట రెడ్డి పేరుతో ఉన్న భూమిని నా కుమారుడు వివేకానంద రెడ్డి పేరుతో వీలునామా రాశారని తెలిపారు. నా తండ్రి అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితం మృతి చెందారని తెలిపారు. నా తండ్రి పేరుతో ఉన్న భూమిని నా కుమారుని పేరుతో మార్పు చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆలోచించారు. భూ సమస్యలపై పలు విడుతలు గా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన లాభం లేదన్నారు. గట్టిగా అడిగితే మాపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నా భూములు ఎన్ని ఉన్నాయని సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన వివరాలు ఇవ్వడం లేదన్నారు. నా భూములు చూపకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని రైతు విడిపించారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.