BREAKING
ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన,

అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్.

Select Suryaa Now
అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్.

అమలాపురం మేజర్ న్యూస్ :చించినాడ బ్రిడ్జిపై రహదారి పూర్తి వెడల్పున బిటుమినస్ కాంక్రీట్ బీసీ వేరింగ్ కోర్స్ తుది తారు పొర నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చించినాడ బ్రిడ్జిపై రహదారి నాణ్యత, మన్నికను పెంపొందించడంతో పాటువాహనదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రహదారి పూర్తి వెడల్పున బిటుమినస్ కాంక్రీట్ (బీసీ) తుది తారు పొర నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు.
ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో, సకాలంలో పూర్తి చేసేందుకు బ్రిడ్జిపై ఒక రోజు పాటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమయంలో భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా ఎటువంటి వాహనాలను బ్రిడ్జిపై అనుమతించబోమని స్పష్టం చేశారు.
జిల్లా ప్రజలు, వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను ముందుగానే గమనించి తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు కొనసాగించాలని కోరారు.ప్రజల ప్రయాణ భద్రత, రహదారి మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చేపడుతున్న ఈ పనులకు ప్రజలు, వాహనదారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు