ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం
నరసాపురం, మేజర్ న్యూస్:కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర సర్కారు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన ఈ వైద్య శిబిరంలో 380 మంది వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం డాక్టర్లు చికిత్స అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏం.రాంబాబు మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం ఆయన ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు మన ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నర్సాపురం నియోజిక వర్గ ప్రాంత ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవలసినదిగా తెలియజేశారు. ఆసుపత్రిలో అని విభాగాల ప్రత్యక వైద్యులు జనరల్ సర్జన్, అనస్థీషియాలజిస్ట్ , గైనకాలజిస్ట్ , జనరల్ మెడిసిన్, అర్ధోపేటిక్, ఈఎన్‌టి , ఆప్తమాలజీ , పీడియాట్రిక్, డెర్మటాలజిస్ట్, డెంటిస్ట్, మైక్రోబయోలాజిస్ట్ ,రేడియోలజిస్ట్, జనరల్ వైద్యులు, కౌన్సిలింగ్ కొరకు సైకాలజిస్ట్ అందుబాటులో ఉన్నారని తెలియజేశారు,ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలల కొకసారి క్రమం తప్పకుండ మెడికల్ చెకప్ చేయించుకోవడం, ప్రతి రోజు కనీసం 40 నిమిషాలు వ్యాయామం చేయడం, ప్రతి ఒక్కరూ కనీసం 7 గంటలు నిద్రపోవడం, సరియైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , ధూమపానం మద్యపానం తదితర వాటికి దూరంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు చందన ప్రియాంకా, కాంతి ప్రియా, చరణ్ రాయ్, ఎస్.వి.ఫణి కుమార్, దీపక్, విజయ లక్ష్మి,నర్సింగ్ సూపరింటెండెంట్ జ్యోతి, హెడ్ నర్సులు ప్రమీల, సౌదామణి, ఐసిటిసి హెల్త్ కౌన్సిలర్ జేసు ప్రసాద్ బాబు, స్టాఫ్ నర్స్ రాజమణి, ఎస్‌ఎస్‌కే మేనేజర్ అనంత లక్ష్మి, ఎస్‌ఎస్‌కే ఓ.ఆర్.డబ్లూ సుసన్న, పేస్ట్ కంట్రోల్ సత్యనారాయణ, జిడిఏ లు మధు బాబు, రమేశ్, ప్రమీల, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా