BREAKING
బంట్వారం ఎస్సైగా పుండ్లిక్ బాధ్యతల స్వీకరణ దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు! ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్ దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు బాక్సాఫీస్ వద్ద రూ. 480 కోట్లు దాటిన దృశ్యం 3.. అజయ్ దేవగన్ నటనపై మోహన్‌లాల్ ప్రశంసల జల్లు! అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం పిల్లలకు బయట ఆటలు ఎందుకు ముఖ్యం.. శారీరక, మానసిక వికాసానికి అవుట్‌డోర్ గేమ్స్ ఎంత అవసరం! సిఐఐ సదస్సులో పాల్గొన్న విప్ నాయకర్ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు: ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులకే జెఫరీస్ ప్రాధాన్యం.. ఎందుకంటే? ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కచ్చితంగా కైవసం చేసుకుంటుంది

బీజేవైఎం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా మణి మోదీ

Select Suryaa Now
బీజేవైఎం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా మణి మోదీ

నారాయణపేట, సూర్యన్యూస్:;భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా పట్టణానికి చెందిన మణి మోదీ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా కమిటి విస్తరణలో భాగంగా 18మందికి కొత్తగా స్థానం కల్పించారు. నలుగురు ఉపాధ్యక్షులు (మణి మోదీ, నరేష్ గౌడ్, చక్రి, శ్రీకాంత్) ఇద్దరు ప్రధాన కార్యదర్శులు (ప్రకాష్, మంజునాథ్), ఐదుగురు సహా కార్యదర్శులు (రవి, నవీన్, అయ్యప్ప స్వామి, సాయికుమార్, శ్రీహరి), పబ్లిసిటీ సెక్రెటరీగా సంజీవ్ రెడ్డి, ఆఫీస్ కార్యదర్శిగా కావాలి నారాయణ, మీడియా ఇంచార్జీగా పి.అంజి, సోషల్ మీడియా ఇంచార్జీగా పాపిరెడ్డి, ఐటి కన్వీనర్ గా జె. భారత్, స్పోక్ పర్సన్ గా కిరణ్ తో పాటు కార్యవర్గ సభ్యుడుగా దత్తాత్రేయలను నియమించారు.


యువత గొంతునై పనిచేస్తా..
ఈ సందర్భంగా మణిమోదీ మాట్లాడుతూ.. తనపై నమ్మకం నుంచి జిల్లా కమిటీలో మొదటి ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, పార్టీ బలోపే దానికి నిబద్దతతో కృషి చేస్తానన్నారు. యువత గొంతుకగా నిలిచి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమాలు చేస్తామన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.