BREAKING
కడియం మండలంలో ప్లాస్టిక్‌ నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యం! చెత్త నిర్వహణ, వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి బంట్వారం ఎస్సైగా పుండ్లిక్ బాధ్యతల స్వీకరణ దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు! ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్ దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు బాక్సాఫీస్ వద్ద రూ. 480 కోట్లు దాటిన దృశ్యం 3.. అజయ్ దేవగన్ నటనపై మోహన్‌లాల్ ప్రశంసల జల్లు! అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం పిల్లలకు బయట ఆటలు ఎందుకు ముఖ్యం.. శారీరక, మానసిక వికాసానికి అవుట్‌డోర్ గేమ్స్ ఎంత అవసరం! సిఐఐ సదస్సులో పాల్గొన్న విప్ నాయకర్ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు: ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులకే జెఫరీస్ ప్రాధాన్యం.. ఎందుకంటే? ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

పొదలకూరు దశ, దిశ మారుస్తోన్న సోమిరెడ్డి

Select Suryaa Now
పొదలకూరు దశ, దిశ మారుస్తోన్న సోమిరెడ్డి

పొదలకూరు,  మేజర్ న్యూస్ :   సోమిరెడ్డి కామెంట్స్  :  నా సోదరుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ గా సర్వేపల్లికి రూ.8.80 కోట్లు మంజూరు చేశారు   మరో రూ.10 కోట్లు మంజూరు చేస్తానని మా శీనయ్య హామీ ఇవ్వడం సంతోషం   నుడా నిధులతో అత్యంత పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి   గత ప్రభుత్వ హయాంలో రూ.26 కోట్లు నుడా నిధులు వస్తే, సవిటి కాలువలు కట్టి మురుగునీళ్లు వెనక్కిపారేలా చేశారు    వైసీపీ నేతల అస్తవ్యస్తంగా మారిన మురుగునీటి వ్యవస్థతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు   పొదలకూరు మండల ప్రజలు గుండెలపై చేయివేసుకుని అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ఆలోచించుకోవాలి   కండలేరు ఎడమకాలువ, సోమశిల దక్షిణ కాలువ, నిమ్మ మార్కెట్, సామాజిక ఆరోగ్య కేంద్రం, డయాలసిస్ సెంటర్, ఐటీఐ, మెగా మినరల్ వాటర్ ప్లాంట్, 150 చెక్ డ్యాంల నుంచి ఈ రోజు చేపట్టిన సెంట్రల్ లైటింగ్ వరకు చేసింది..చేస్తున్నది ఎవరు  నాకు ఏ ఎన్నికల్లోనూ పొదలకూరు మండల ప్రజలు మెజార్టీ ఇవ్వకపోయినా ఇవన్నీ చేశాను  సమితి ప్రెసిడెంటు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, మంత్రి పదవులు అనుభవించిన పెద్దమనుషులు సొంత మండలానికి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి  నేను ఓడిపోయి చేసిన పనులను గెలిచిన నాయకులు ఎందుకు చేయలేకపోయారు  మంచి చేయకపోగా మినరల్ వాటర్ ప్లాంటును శిథిలావస్థకు చేర్చారు..దక్షిణ కాలువ పనులను అడ్డుకున్నారు..ఎడమ కాలువ లిఫ్ట్ నూ మూలనపెట్టేందుకు ఐదేళ్లూ కరెంటు బిల్లులు కట్టలేదు  తోడేరు ప్రజలు ఏ రోజూ నాకు ఓటు వేయలేదు..కానీ నాకు వారిపై కోపం లేదు.. 127 ఎకరాలకు సంబంధించి పట్టాలు మంజూరు చేయాలని 50 మంది రైతులు కోరారు..వారికి పట్టాలు ఇప్పించే బాధ్యత నాదే    తోడేరు హైస్కూలులో వాటర్ ప్లాంటు అడిగారు..గ్రావెల్ మంజూరు చేయాలని కోరారు. అన్నీ పనులను చేస్తాను   ఓటు వేసిన వారిని, వేయని వారిని ఒకే రకంగా చూస్తా..రాజకీయాలకు అతీతంగా పనిచేస్తా       రేపు జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పొదలకూరు ప్రజలు సత్తా చాటాలి...పని చేసిన వారికి ఓటు వేసి ఆశీర్వదిస్తారని నిరూపించాలి    అక్రమాలు, దోపిడీలకు పాల్పడిన వారిని ఓటు వేయరని చాటి చెప్పాలి   గెలిచినా, ఓడినా ప్రజల కోసమే బతికే నాయకుడిని నేను...ఏ రోజూ డబ్బు కోసం బతకలేదు  పొదలకూరు మండలానికి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు ఇదే సరైన సమయం

కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కామెంట్స్   :     మా చిన్నతనం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయాలు, పోరాటాలను చూస్తూ పెరిగాం  వ్యవసాయ శాఖ మంత్రి ఎలా పనిచేయాలో చేసి చూపించిన రైతు బాంధవుడు   ఇరిగేషన్ వ్యవస్థపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు   సోమిరెడ్డి కోరిన వెంటనే పొదలకూరు ప్రజలకు సెంట్రల్ లైటింగ్ హామీని ఇచ్చాం..ఈ రోజు నెరవేరుస్తున్నాం   డివైడర్ ఏర్పాటుతో పాటు మొక్కల పెంపకంతో అందమైన పొదలకూరుగా రూపుదిద్దుకుంటుంది..అందుకు అవసరైన మరో రూ.30 లక్షలు మంజూరు చేస్తా   ఈ బృహత్తర కార్యక్రమానికి వ్యాపారులందరూ సహకరించాలని కోరుతున్నా...పొదలకూరు రూపు మారుతుంది..స్థలాల విలువ కూడా భారీగా పెరుగుతుంది   ఈ ప్రాంతం నుంచి ఎందరో నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు...కానీ పొదలకూరును మరిచిపోయారు  నేను ఎవరినీ విమర్శించడం లేదు..ఈ ప్రాంతాన్ని విస్మరించిన వారి బాధ్యతను గుర్తు చేస్తున్నాను  నెల్లూరు ట్రంకురోడ్డు తరహాలో ఉన్న పొదలకూరు మెయిన్ రోడ్డులో సెంట్రల్ లైటింగ్ పెట్టాలని ఎందుకు    ఆలోచించలేదు  గత ప్రభుత్వంలో నుడా నిధులు రూ.26 కోట్లు తీసుకున్నారే..సెంట్రల్ లైటింగ్ కు రూ.1.50 కోట్లు ఖర్చుపెట్టలేకపోయారా  రాజకీయాలు శాశ్వతం కాదు..మనం చేసే మంచి పనులే శాశ్వతం  కూటమి ప్రభుత్వంతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న మంచిని చూసి ఓటుతో ఆశీర్వదించాలని  పని పాట లేని తూత్ మాలిష్ ప్రతిపక్షాన్ని స్థానిక ఎన్నికల్లోనూ తరిమికొట్టాలని ప్రజలను కోరుతున్నా