BREAKING
బ్రిటన్‌లో బోనస్‌ పరిమితి రద్దు: ఉద్యోగుల 'ఫిక్స్‌డ్ పే అలవెన్సులు' ఎత్తివేయనున్న హెచ్‌ఎస్‌బీసీ.. 2028 నుంచి పెరగనున్న బోనస్‌ల వాటా! ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! ఆసరాగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం.

కడియం మండలంలో ప్లాస్టిక్‌ నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యం! చెత్త నిర్వహణ, వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
కడియం మండలంలో ప్లాస్టిక్‌ నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యం!  చెత్త నిర్వహణ, వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి

కడియం, మేజర్ న్యూస్ కడియం మండలంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించడంతోపాటు, గ్రామాల్లో చెత్త నిర్వహణను మెరుగుపరిచేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కడియం మండల బిజెపి అధ్యక్షుడు బొరుసు సుబ్రహ్మణ్యం కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విభాగానికి సోమవారం వినతిపత్రం సమర్పించారు.

మండలంలోని గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని, సరైన చెత్త నిర్వహణ సౌకర్యాలు లేకపోవడంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.దుకాణాలు, మార్కెట్లు, హోటళ్లలో ప్లాస్టిక్‌ వినియోగంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాలు విధించాలని కోరారు.

 గ్రామ పంచాయతీల్లో శాస్త్రీయ చెత్త నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బహిరంగంగా చెత్తను తగలబెట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అలాగే, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత కాలుష్య నియంత్రణ అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బొరుసు సుబ్రహ్మణ్యం కోరారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.