వెంకటేశ్వర దేవాలయం కు ఎమ్మెల్యే శంఖు స్థాపన
కొత్తూరు, సూర్య : కొత్తూరు మండలం వసప గ్రామంలో తిరుపతి తిరుమల దేవాస్థానం శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలు వ్యయం తో నిర్మాణం చేయనున్న ఆలయానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం శంఖు స్థాపన చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి ఆలయ నిర్మాణం భక్తులు ఆధ్యాత్మిక ఆకాంక్షాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆలయ నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందుతుందని అన్నారు. ఆలయ నిర్మానానికి 40లక్షలు రూపాయలు మంజూరు కృషి చేసిన ఎమ్మెల్యే గోవిందరావు కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియ జేశారు కార్యక్రమం లో న్యాయ వాది వి సుధాకరరావు ఆగతముడి అరుణ్ కుమార్ ,ఆగతముడి మాధవరావు,మాతల గాంధీ,నాగల్ల అప్పన్న ,నూలు వీరభద్రస్వామీ ,చింతాడ కోటేశ్వరరావు , గోగుల వర ప్రసాద నాయుడు,చోడవరపు రాము తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సీతారామమూర్తి, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా.