అన్నపూర్ణా దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శ్రీ ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి కోదండ రామస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడంతోపాటు ప్రధాన వీధుల్లో కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు డి.లక్ష్మణమూర్తి, సిహెచ్ సుధీర్ బాబు, పరిటాల వెంకట సత్యనారాయణ, పి.శరత్ బాబు, ఎస్ కిరణ్ కుమార్, కె.సురేష్ బాబు, రాజా వెంకటేష్, ఎం హరికృష్ణ,నున్న సంతోష్ కుమార్, ఆర్. సత్యనారాయణ, ఏ.వీ. రాము,సిహెచ్.తరుణ్, జి. వెంకటేశ్వర్లు, డి. శ్రీనివాసులు, శ్రీరాం శీను, టీ. చిన్న బాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిన్ని సుధీర్ బాబు, కార్యదర్శి సోమిశెట్టి కిరణ్ కుమార్, కోశాధికారి కొలిశెట్టి చంద్రమోహన్, ఆలయ చైర్మన్ దోర్నాదుల సురేష్ బాబు, కార్యదర్శి పొన్నూరు హాజరత్తయ్య, కోశాధికారి మద్దాలి సతీష్ కుమార్ ఉత్సవాలను పర్యవేక్షించారు. అమ్మవారికి సహస్ర నామార్చనతోటి కుంకుమ పూజ జరగింది. ఉత్సవాల్లో రెండవ రోజైన సోమవారం అమ్మవారికి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి
ఉభయకర్తలుగా మద్దాళి సతీష్ కుమార్, మద్దాళి రామకృష్ణ,మద్దాళి సూర్యనారాయణ, భోగనాథం మోహన్ రావు, భోగనాదం మధుబాబు, తన్నీరు వేణుగోపాల్, దోర్నాధుల శ్రీనివాసులు, ఎక్కం శివ నారాయణ, పబ్బిశెట్టి ప్రసాద్ అండ్ బ్రదర్స్,కూరపాటి నారాయణ భార్య కుమారి, గుర్రం మల్లికార్జున అండ్ బ్రదర్స్,యాదాల సుబ్బారావులు వ్యవహారించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్తప్రసాదాలు స్వీకరించారు.