BREAKING
మీ రాక మాకు పండుగ జనసేన విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి గడ్డమణుగు రవికుమార్ షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ గా వెంకటేశ్వర్లు... కేశంపేట సిఐ గా శ్రీనివాస్.. దుర్గమ్మ కరుణా, కటాక్షం ప్రజలందరిపై ఉండాలి ప్రజలకు మెరుగైన అంతరాయం లేకుండా విద్యుత్ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేయాలి ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం జర్నలిస్ట్ ఆర్కే ను పరామర్శించిన రాజా, వేణు సీఎం దసరా శుభాకాంక్ష్లలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్.. జనరల్ సెక్రటరీగా ఎం. డేనియల్ ప్రదీప్ దండేపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక ఓటు బచావో - దేశ్ బచావో - ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రేపు వికారాబాద్‌లో బీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం మంత్రులకు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

బాలాపూర్ లో ఘనంగా రెండో సీరత్-ఉన్ -నబీ వేడుకలు

Select Suryaa Now
బాలాపూర్ లో ఘనంగా రెండో సీరత్-ఉన్ -నబీ వేడుకలు

*బాలాపూర్‌లో ఘనంగా రెండో సీరత్‌-ఉన్‌-నబీ వేడుకలు*

"సీరత్‌-ఉన్‌-నబీ సందేశం.. శాంతి, సోదరభావానికి ప్రతీక!"

"విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి"

బడంగ్‌పేట్‌ లోని మహమ్మద్‌ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ఆచరణలోకి తీసుకురావడమే సీరత్‌-ఉన్‌-నబీ వేడుకల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొ
న్నారు. మత సామరస్యం, పరస్పర గౌరవం, సామాజిక ఐక్యతను చాటుతూ బడంగ్‌
పేట్‌ సర్కిల్‌-16 ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండో సీరత్‌-ఉన్‌-నబీ వేడుకలు, బహుమ
తుల ప్రదాన కార్యక్రమం ఆది
వారం ఘనంగా నిర్వహించారు.
బాలాపూర్‌లోని అల్‌ యాసీన్‌ కాలనీ, గణేష్‌ చౌక్‌ సమీపం
లోని టీవై రాయల్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మహే
శ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలు
గా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

*యువతలో సత్ప్రవర్తనకు ప్రోత్సాహం..*

మహమ్మద్‌ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత విశేషాలు, బోధ
నలను స్మరించు
కుంటూ నిర్వహిం
చిన ఈ వేడుకలు యువతలో నైతిక విలువలు, సేవా
భావం, సామాజిక బాధ్యతను పెంపొందించేలా సాగాయి. మతాలకు అతీతంగా మానవ
త్వానికి ప్రాధాన్య
మివ్వడం, సమా
జంలో ఐక్యతను బలోపేతం చేయడం, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ కార్య
క్రమం చాటిచెప్పింది.
సంఘం ప్రతినిధులు, మైనారిటీ నాయ
కులతో బడంగ్‌పేట్‌ సర్కిల్‌-16 ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం కోర్‌ టీమ్‌ అధ్యక్షుడు షరీఫ్‌ అబ్దుల్లా యమాని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ అఖీల్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రఫీక్‌ మహమ్మద్‌, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అఫ్జల్‌ అహ్మద్‌, సంయుక్త కార్యదర్శులు మహమ్మద్‌ అన్వర్‌ జియా, మహమ్మద్‌ ఫయాజుద్దీన్‌, కోశాధికారులు మహమ్మద్‌ మహమూద్‌ అలీ, జమీల్‌ అహ్మద్‌తో పాటు కమిటీ సభ్యులు, ముస్లిం మైనారిటీ నాయ
కులు, స్థానికులు పాల్గొన్నారు.
సీరత్‌-ఉన్‌-నబీ బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మత సామరస్యం, సోదరభావం, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహ
దపడతాయని నిర్వాహకులు తెలిపారు.

బి. గణేష్, మేజర్ న్యూస్ బాలాపూర్.